//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కుక్కని పెంచే ముందు జాగ్రత్త

Category : national

పెంపుడు కుక్కల యజమానులకు ముంబై కార్పోరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై వాటిని రోడ్లపైకి తీసుకొచ్చి మల విసర్జన చేయిస్తే కటిన చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ముంబై నగరంలోని సంపన్నులు నివాసముంటున్న మలబార్ హిల్స్, పెద్దార్ రోడ్డు, నేపాన్ సీ రోడ్, ఆగస్ట్ క్రాంతి మార్గ్ ప్రాంతాల్లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అదికారులు ప్రత్యేకంగా దాడులు చేసి రోడ్లపై పెంపుడు కుక్కలతో మలమూత్రాలు చేయించిన యజమానులకు జరిమానా విధించారు.

మున్సిపల్ సిబ్బంది రోడ్లను పరిశుభ్రం చేసి 16 మంది పెంపుడు కుక్కల యజమానుల నుంచి రూ.500 చొప్పున జరిమానా వసూలు చేశారు. పెంపుడు కుక్కలను రోడ్లపైకి తీసుకువచ్చి వాటితో మల మూత్రాలు చేయిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ సహాయ కమిషనర్ విశ్వాస్ హెచ్చరించారు. అనంతరం ఐఎఎస్ ఆఫీసర్స్ హౌస్ , చర్చ్ గేటు, మెరీన్ డ్రైవ్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది గస్తీ తిరుగుతూ పెంపుడు కుక్కల యజమానులకు అవగాహన కల్పించారు.

Related News