Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా జాగ్రత్త...! 2 ఏళ్ల వ్యవధిలో 4 వేల మందికి పైగా బాలికల అదృశ్యం...?

Category : state

2 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 4,276 మంది అమ్మాయిల అదృశ్యం . అందులో 2,448 మంది ఆచూకీ ఇంకా లభ్యం కానీ పరిస్థితి ...ఇక మిగతా 1,828 మంది ఏమయ్యారో కూడా తెలియని దుస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలను అట్టు ఉడికిస్తున్న బాలికల మిస్సింగ్ కేసులు. కన్న వారికి కడుపుకోత , అయిన వారికి గుండె కోత ఎంతో వేదనకు గురి చేస్తుంది. వేల సంఖ్యలో బాలికల అదృశ్యం..ఎన్నో వేల కుటుంబాలలో తీరని దుః ఖాన్ని నింపుతుంది. పిల్లల అదృశ్యంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కంటికి రెప్పలా కాచుకున్న తమ పిల్లలు ఏమయ్యారో తెలియక అంతులేని క్షోభ మధ్యే బతుకీడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో అదృశ్యమైన 18 ఏళ్లలోపు బాలికల్లో 1,828 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారో, ఏమయ్యారో కూడా అంతుపట్టని దుస్థితి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ రాష్ట్రంలో 4,276 మంది బాలికలు అదృశ్యం కాగా అందులో 2,450 మంది ఆచూకీ మాత్రమే లభ్యమైంది. ఇలా తప్పిపోయిన వారిలో 42 శాతం మంది జాడ ఇప్పటికీ తెలియని దుస్థితి. పెద్ద యెత్తున ఇలాంటి ఘోరాలు జరుగుతున్న పోలీసు శాఖ మాత్రం ఈ సమస్య తీవ్రతను గుర్తించలేకపోతోంది.ఇలాంటి మిస్సింగ్ కేసులు పెద్ద ఎత్తున జరుగుతున్న వాటి మూలాలను ఛేదించి దాని వెనుకనున్న వ్యవస్థీకృత దందాను బయటపెట్టలేకపోతోంది.

ఈ ఉదాసీనత ఫలితంగానే అదృశ్యమవుతున్న బాలికల సంఖ్య గణనీయంగా రోజు రోజుకీ పెరిగిపోతోంది.ఇలా అనేక సందర్భాలలో వారి కథ విషాదాంతమవుతోంది. అలా నేరాల పెరుగుదలకు కారణమవుతోంది.బాలికలు కనిపించటంలేదంటూ ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లే తల్లిదండ్రులకు ఎక్కువ సందర్భాల్లో పోలీసుల నుంచి సూటిపోటి మాటలే ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఛీదరింపులు, ఛీత్కారాలు కూడా తప్పటం లేదు. కడుపు కోత తో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది అన్న నమ్మకమే కోల్పోతున్నారు బాధితులు. ఈ లెక్కన కొందరు పోలీసులు అసలు ఫిర్యాదులనే స్వీకరించకపోవటం గమనార్హం,ఇందులో ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి అంటే అందులో సగానికి పైగా కేసులు నమోదు చేయకపోవటం శోచనీయం, దర్యాప్తుపై దృష్టిపెట్టకపోవటం వంటివి నిత్యకృత్యమవుతున్నాయి. అదృశ్యమవుతున్న బాలికల జాడను కనిపెట్టే విషయంలో ఇవన్నీ భాదితులు ఎదుర్కుంటున్న ఆటంకాలవుతున్నాయి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 4,276 మంది బాలికలు అదృశ్యం కాగా.. 3,528 కేసుల్లోనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకావటం గమనార్హం.

Related News