//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ ఎన్నికల పై సర్వత్రా ఉత్కంఠము .....ఎన్నికల రిజల్ట్స్ పై భారీ ఆశలు పెట్టుకున్న బెట్టింగ్ రాయుళ్లు.

Category : politics

ఏపీని కలవరపెడుతున్న ఎన్నికల ఫీవర్..... ఏం చేయాలో అర్థం కాక తలలు భాదు కుంటున్న బెట్టింగ్ రాయుళ్లు. గతంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠ భరితంగా ఈ సారి జరిగిన ఎన్నికలు.ఎగ్జిట్ పోల్స్ నేతలను ఎంత టెన్షన్ పెడుతున్నాయో లేదో కానీ, ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కాసిన పందెం రాయుళ్లను మాత్రం తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు పలు సర్వెల్ నిర్వహించగా....అందులో ఏ పార్టీ ఎన్ని సీట్ల తేడాతో గెలుస్తుందో చాలా లెక్కల తో ఎంతో క్షుణ్ణంగా తేల్చి నప్పటికీ..... ఏ సర్వే ఎంత నిజం అన్నది ఇప్పుడే చెప్పలేం. ఇందులో భాగంగానే లగడపాటి సర్వేల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ, అటు పై కొన్ని జాతీయ సర్వేలు మాత్రం వైసీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఈ లెక్కన ఏ సంస్థ యెక్క సర్వే నీ ఎలా నమ్మాలో తెలియక అంతా తలపట్టుకుంటున్నారు. అయితే అంతిమంగా లగడపాటి సర్వేలో సైతం సీట్లలో చాలా తేడా ఉంది.

85 నుంచి 100 సీట్లు టీడీపీకి వస్తాయనీ ఆయన తేల్చినప్పటికీ ఈ గణాంకాల్లో ఆక్యురసీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా 100 సీట్లకు పది సీట్లు తగ్గొచ్చు.. లేదా ..పెరగవచ్చు...అని ముక్తాయింపునివ్వడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎందుకంటే ఈ సీట్ల రేంజ్ లో భారీ గ్యాప్ కనిపిస్తోంది. ఈ అంశం కూడా బెట్టింగ్ రాయుళ్ల నీ ఒక్కింతా కలవరానికి గురిచేస్తోంది.ఇదే నేపధ్యంలో మరో బలమైన పార్టీగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న జనసేన సైతం ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతుందని అంతా భావిస్తున్నారు, కానీ చాలా సర్వేలు మాత్రం జనసేన ఊసే లేకుండా సాగిపోతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఏ సీటులో గెలవబోతున్నాడు అని పందెం కాసిన రాయుళ్లకు టెన్షన్ పట్టుకుంది. అయితే లగడపాటి మాత్రం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతాడని చెప్పడం కాస్త ఊరటకలిగించే అంశమే.మరోవైపు జాతీయ సంస్థలతో పాటు పలు స్థానిక సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.

అయితే వాటి విశ్వసనీయతపై పలు అనుమానాలు కూడా ఖచ్చితంగా వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో సైతం ఇలాగే ఎన్నో సర్వేలు ప్రతి ఒక్కర్ని తికమకపెట్టినప్పటికీ, చివరికి కేసీఆర్ ఘన విజయం సాధించారు. దీంతో సర్వేల్లో ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో తెలియడం లేదు. సర్వేలు విడుదల చేసిన అరడజను జాతీయ సంస్థల్లో సైతం కొన్ని పార్టీ టీడీపీ వైపు, మరో సగం సంస్థలు వైసీపీ వైపు నిలిచాయి. అయితే గతానికి భిన్నంగా ఇలా సర్వే సంస్థల ఫలితాలు అడ్డంగా చీలిపోవడం రాజకీయవర్గాలతో పాటు, వాటినే నమ్ముకున్న బెట్టింగ్ బాబులకు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో అలాగే ఇప్పటికే భారీ మొత్తంలో పందెం కాసిన బెట్టింగ్ బాబులు నష్టపోకుండా అవతలి పక్షం వైపు కూడా కొంత మొత్తం బెట్టింగ్ పెడుతున్నారు. ఈ లెక్కన మరో మూడు రోజుల్లో వెలువడ నున్న ఎన్నికల ఫలితాల పై ప్రతి ఒక్కరిలోనూ భారీ ఉత్కంఠ ము అయితే నెలకొని ఉంది.