ఇన్స్ట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడిఆర్‌బిటి) 'ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్' విభాగంలో ఆంధ్రా బ్యాంకుకు బెస్ట్ బ్యాంక్ అవార్డును అందించింది. 2016-17 మధ్యస్థ బ్యాంకుల విభాగంలో ఈ అవార్డు దక్కినట్లు ఆంధ్రా బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ అవార్డును ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ సేన్, ఎస్ గణేష్ కుమార్, ఐడిఆర్‌బిటి డైరెక్టర్ ఎఎస్ రామశాస్త్రీలు ఆంధ్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎకె రత్, జనరల్ మేనేజర్ ఎఎస్ కెటి వేణు మాధవ్‌కు అందజేశారు.