బాలీవుడ్ బడా స్టార్స్'ని పక్కకు నెట్టి భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఉత్తమ నటుడు అవార్డు కైవసం చేసుకున్నాడు. శనివారం ముంబైలో 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో ఇర్ఫాన్ పఠాన్ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
అదేంటీ ? ఇర్ఫాన్ పఠాన్ హీరో ఎప్పుడు అయ్యాడు ? ఏ సినిమాలో నటించాడు ?? అని ఆయన అభిమానులే ఆశ్చర్యపోయేలా చేశాడు. వాస్తవానికి ఇర్ఫాన్ పఠాన్ సినిమాల జోలికి వెళ్లలేదు. ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రముఖ మ్యాగజైన్ ‘ఫెమినా’ తప్పిదం వలన ఇర్పాన్ పటాన్ ఉత్తమ నటుడు అయ్యాడు. "హిందీ మీడియం" సినిమాకు గానూ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది.
ఐతే, మ్యాగజైన్ ‘ఫెమినా’ తన ట్విటర్లో ఇర్ఫాన్ ఖాన్ పేరుకు బదులు ఇర్ఫాన్ పఠాన్ అని పేర్కొంది. దీనిపై సరదాగా స్పందించిన ఇర్పాన్ పటాన్.. " ధన్యవాదాలు. నేను అవార్డు అందుకోవడానికి రాలేను. నా అవార్డును ఇంటికి పంపించండి" అని పేర్కొన్నాడు. ఇప్పుడీ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో ఇర్పాన్ పటాన్ కీలక పాత్ర్ర పోషించారు. ఆయన భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయి చాన్నాళ్లవుతుంది. ప్రస్తుతం జరుగుతోన్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇర్ఫాన్‌కు చోటు దక్కంది.