//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రముఖ హీరో మృతి : విషాదంలో చిత్ర సీమ, ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి

Category : national

సినీ పరిశ్రమల దిగ్గజ నటుల అస్తమయం జరుగుతూనే ఉంది.. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో మంది మంచి నటులు, కామెడీ లో జీవించగల నటులను కోల్పోయింది. ఆ విషాదం మరువక ముందే. బెంగాలి సీనియర్ నటుడు పార్థ ముఖోపాధ్యాయ ఈరోజు కన్నుమూశారు.

ఆయన వయస్సు 70 ఏళ్లు. గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్థ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

1958లో ‘మా’ సినిమాతో బాలనటుడిగా చిత్రరంగం లోకి ప్రవేశించిన ఆయన, దర్శకుడు తపన్ సిన్హా తెరకెక్కించిన ‘అతిథియా’ సినిమాతో ఆయన పార్థ హీరోగా పరిచయమయ్యారు. బెంగాల్ సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్ తమ్ముడు, కొడుకు పాత్రల్లో నటించేందుకు పార్థ ముఖోపాధ్యాయనే నాటి దర్శకులు ఎంపిక చేసేవారు. పార్థ ముఖోపాధ్యాయ నటించిన చిత్రాల గురించి చెప్పాలంటే.. బాలిక బధూ, ధోన్యి మెయె, అగ్నిష్వర్, అమర్ పృథ్వీ, బాగ్ బందీ ఖేలా, పాపులర్ వంటి సినిమాల్లో ఆయన నటించారు. కాగా పార్థ 60వ దశకంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు.

రవీంద్రనాథ్‌ టాగోర్‌ షార్ట్‌స్టోరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇంకా తపన్‌ సిన్హా తెరకెక్కించిన ‘అపోంజాన్‌’ సినిమాలో కూడా హీరోగా కనిపించారు. పార్థ ముఖోపాధ్యాయ మృతి పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పార్థ అనారోగ్యంతో మృతి చెందడంతో మమతా బెనర్జీ ట్విట్టర్‌లో నివాళులర్పించారు. ఎన్నో సినిమాల్లో గొప్ప అభినయాన్ని ప్రదర్శించిన పార్థ ముఖోపాధ్యాయ బెంగాలీ సినీ ప్రేమికుల మదిలో శాశ్వత స్థానాన్ని పొందారని మమతా తెలిపారు.