Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పుచ్చకాయతో ఆరోగ్యమే కాదు అందం కూడా మీ సొంతం

Category : health

వేసవి రాగానే మనకు ముందు గుర్తొచ్చే పేరు పుచ్చకాయ. వేసవి కాలానికి ఊరటగా ఉండే పుచ్చకాయ నీటి శాతంలో అధికంగా ఉంటుంది. తియ్యగా ఉండడమే కాకుండా, మానసికంగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా, శరీరంలో నీటి స్థాయిలను పెంచడంతో పాటు, డీహైడ్రేషన్ సమస్యలకు చెక్ పెట్టేందుకు దోహదపడుతుంది. పుచ్చకాయ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మీ చర్మానికి మరియు జుట్టుకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుందని చెప్పబడింది.

పుచ్చకాయలో అత్యంత ముఖ్యమైన విటమిన్లు మరియు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా లైకోఫేన్ అనే ప్రత్యేకమైన పదార్ధం, మీ చర్మం నుంచి ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సాయపడుతుంది, దానివల్ల చర్మం పాడవకుండా కాపాడగలుగుతుంది. మీరు పుచ్చకాయను రోజువారీగా ఆహార ప్రణాళిక లో చ్ర్చుకుంటే , క్రమంగా దీని యొక్క అద్భుతమైన ప్రయోజనాలను శరీరానికి అందించవచ్చు. లేదా ఫేస్ మాస్క్, క్లెన్సర్స్, హెయిర్ మాస్క్లు లేదా కండిషనర్ల రూపంలో మీ చర్మం మరియు జుట్టు సంరక్షణా చర్యలలో భాగంగా కూడా దీనిని చేర్చవచ్చు.

విటమిన్ A, B6, మరియు C తో లోడ్ చేయబడిన పుచ్చకాయ నిజంగా ఒక దివ్య ఫలమనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇది మీకు ప్రకాశమైన చర్మాన్ని ఇస్తుంది. ఇది మీ చర్మాన్ని పోషకమయం చేస్తుంది. మీ చర్మాన్ని తేమగా మరియు హైడ్రేట్ చేస్తుంది. ఇది ఒక నేచురల్ స్కిన్ టోనర్ గా మరియు క్లెన్సర్ వలె పనిచేస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ వలె పనిచేస్తుంది. ఇది మీ చర్మంలో అదనపు నూనెల ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఇది మీ పొడి చర్మానికి ఉత్తమమైన ట్రీట్మెంట్. ఇది టాన్ తొలగిస్తుంది. ఇది మీకు ముడుతలు లేని చర్మాన్ని అందిస్తుంది మరియు చారలను తొలగిస్తుంది. ఇది మొటిమలను, ఆక్నే సమస్యను కూడా నివారిస్తుంది. మరి ఏ విధంగా తీసుకున్న ఆరోగ్యాన్ని , అందాన్ని పెంచే పుచ్చకాయను మీ ఆహారంలో భాగం చేసుకోండి.