//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తమిళ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ ''రాచ్చసన్'' లో ...బెల్లంకొండ శ్రీనివాస్

Category : movies

నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు సినీమా వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్..తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను వంటి పెద్ద యాక్షన్ దర్శకులతో పనిచేసే అవకాశం పొందిన ఈ హీరో. ఇప్పటివరకు తానూ నటించిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో నిరాశే ఎదురైంది.

మాస్ హీరోగా ముద్ర వేసుకోవడానికి ఎంత గా ప్రయత్నిస్తున్నా పెద్దగా ఆదరణ లభించడంలేదు. కిందటేడాది వచ్చిన ‘సాక్ష్యం’, ‘కవచం’ ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో యాక్షన్ సినిమాలే కాకుండా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేయాలని ‘సీత’ అనే సాఫ్ట్ సినిమాలో నటించేందుకు దర్శకుడు తేజతో కలిసి పని చేస్తున్నాడు. ఇది సెట్స్‌పై ఉండగా మరో చిత్రాన్ని ప్రారంభించారు.

త‌మిళంలో సూప‌ర్‌ డూప‌ర్‌ హిట్ అయిన 'రాచ్చసన్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సాయి శ్రీనివాస్ త‌న లుక్‌ని మార్చుకున్నారు. ఈ సినిమా అంతా సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శకుడు ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ కొత్త చిత్రం గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.ఈరోజు నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఎ హ‌వీష్ ల‌క్ష్మణ్ కొనేరు ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్యనారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు స‌న్నివేశానికి హ‌వీష్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్‌.నారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. గిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా, వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’ అని చెప్పారు.

Related News