//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బేగంపేట్ ఎయిర్ పోర్ట్ తెరిచే అవకాశం !

Category : business

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం కావడంతో ప్రభుత్వం మూసివేసిన బేగంపెట్ ఎయిర్ పోర్ట్ ను తిరిగి తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిని విఐపి ల విమానాల కోసమే ఉపయోగిస్తున్నారు.  దేశంలో ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణం అనేక రేట్లు పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్ట్ లు ఇరుకుగా ఉండటం, రాత్రి పూట విమానాలు ఆగడానికి తగు స్థలం లేక పోతూ ఉండడంతో ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు చూడాలని పౌర విమానం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

ఈ సందర్భంగా పనిచేయకుండా ఉన్న హైదరాబాద్ లోని బేగంపెట్, బెంగుళూరు లోని హెచ్ ఏ ఎల్ ఎయిర్ పోర్ట్ లను తిరిగి తెరిచే ఆలోచనలు చేస్తున్నారు. అదే విధంగా ముంబయి లో రద్దీ తగ్గించడం కోసం నాగపూర్, ఔరంగాబాద్ ఢిల్లీ కోసం ఆగ్రా, చెన్నయి కోసం అరక్కోణం ఎయిర్ పోర్ట్ లను విస్తృత పరచనున్నారు. 

బేగంపేట్,హచ్ ఏ యల్ ఎయిర్ పోర్ట్ లను కొత్త ఎయిర్ పోర్ట్ లు పనిచేయడం ప్రారంభించడంతో కొద్దీ సంవత్సరాల క్రితం ప్రభుత్వం మూసివేసినది. కేవలం కొత్త ఎయిర్ పోర్ట్ లను నిర్వహిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాల ప్రయోజనాల కోసం ఈ విధంగా చేశారనే విమర్శలు అప్పట్లోనే చెలరేగాయి. 150 కి మీ పరిధి వరకు మరో ఎయిర్ పోర్ట్ ఉండరాదని ఆ యాజమాన్యాలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడమే అందుకు కారణం. ప్రస్తుతం దేశంలో ప్రతి సంవత్సరం విమాన ప్రయాణికుల సంఖ్య 20 శాతం మేరకు పెరుగుతున్నది.