Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీ - టౌన్ లో వైరల్ గా మారిన వార్త..... సల్మాన్ ఖాన్ వయసు తన తల్లి వయసు కంటే పెద్ద వాడట.

Category : movies

తాజాగా బీ - టౌన్ లో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి ఆ వార్త అనుకుంటున్నారా.... బాలీవుడ్ ఆక్షన్ హీరో సల్మాన్ ఖాన్ కంటే ఆమె తల్లి వయసు చాలా చిన్నదట. వినడానికి వింతగా ఉన్న ఈ వార్త మాత్రం నిజమే అంటున్నారు బాలీవుడ్ వాసులు.అసలు వివరాల్లోకి వెళితే..... రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన భారీ బడ్జెట్ ఆక్షన్ చిత్రం "భారత్". ఈ సినిమా అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో తెర కెక్కడం జరిగింది. ఈద్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన తొలి వారంలోనే దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సల్లు భాయ్ కెరీర్ మరో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.అయితే అలాగే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కి తల్లి పాత్రలో సోనాలీ కులకర్ణి నటించింది. ఈమె యాక్టింగ్‌కు బీ - టౌన్ జనాలు కూడా ఫిదా అయ్యారు అంతలా తన నటనతో ఆకట్టుకున్న ఈ సోనాలి.

సల్లూ భాయి కి తల్లి పాత్రలో నటించిన సోనాలి కులకర్ణి అసలు వయసు 44 నేనట, ఆమె కొడుకుగా నటించిన సల్మాన్ ఖాన్ వయసు మాత్రం ప్రస్తుతం 53 ఏళ్లు కావడం విశేషం.ఈ సినిమాలో తనను సల్మాన్ తల్లి పాత్రకు ఎంపిక చేసినందకు తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని ఆమె తాజా చెప్పుకొచ్చారు. తన నిర్ణయం కొందరికీ నచ్చపోయినా..మెజారిటీ ప్రజలకు నచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది.గతంలో సోనాలి కులకర్ణి.. హృతిక్ రోషన్‌కు కూడా తల్లిగా నటించింది. ఆడియన్స్ కూడా ఏజ్ గ్యాప్‌ను పరిశీలించినప్పటికీ యాక్టింగ్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తారని ఆమె చెప్పుకొచ్చింది. ఈ రకంగా చూసుకుంటే తెలుగు లో కూడా చాలా మంది సీనియర్ నటీమణులు వారికంటే సీనియర్ హీరోలకు తల్లి పాత్రల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.....ఈ విషయానికి వస్తె అప్పట్లో చిరు, వెంకీ, బాలయ్య,నాగ్ లకు అన్నపూర్ణ మ్మ లాంటి వాళ్ళు తల్లిగా ఆ తరువాత చాలా మంది నటీమణులు తకంటే ఏజ్ లో పెద్ద హీరోలకు తల్లి పాత్రలు పోషించడం చూసాం.

Related News