//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వివాహాలలో కీలకం అవుతున్న అందం, తల్లితండ్రుల సమ్మతి

Category : national editorial


ఆధునిక యువత జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో అందాన్ని, వివాహం పట్ల తల్లితండ్రుల సమ్మతి పొందడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగం, ఆదాయం, జీవితంలో ఏమాత్రం విజయం సాధించారు, వారిలో హాస్యచతురత వంటి అంశాలకు అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

ప్రముఖ వివాహ వేదిక షాదీ.కం జరిపిన సర్వేలో ఈ ఆసక్తికర అంశాలు తెలిసాయి. మొత్తం 6,800 మంది సర్వేలో పాల్గొనగా వారిలో 47 శాతం మంది యువతులు. మరో  53 శాతం మంది యువకులు ఉన్నారు. యువతులతో కేవలం 3 శాతం మంది మాత్రమే తమకు కాబోయే వరుడు హాస్యచతురత కలిగి ఉండాలని చెప్పారు. అయితే యువకులలో మాత్రం 17 శాతం మంది తమకు కాబోయే భాగస్వామిలో అటువంటి లక్షణాన్ని కోరుకొంటున్నారు. 

వరుడు చూడడానికి అందంగా కనిపించాలని 53 మంది యువతులు అనుకొంటున్నారు. అతని భౌతిక రూపం చూడగానే ఆకర్షణీయంగా ఉండాలని భావిస్తున్నారు. మగవారిలో ఆ విధంగా భావించే వారి సంఖ్య కొంచెం ఎక్కువగా 64 శాతం గా ఉంది. తాము కోరుకొనే మగవారు జీవితంలో విజయవంతులై ఉండాలని 21 శాతం మంది మగువలు కోరుకొంటున్నారు. మగవారిలో ఈ సంఖ్య చాల తక్కువగా 13 శాతం మాత్రమే ఉంది. 

అయితే నేటి యువత తల్లితండ్రుల సమ్మతితో వివాహం చేసుకోవాలని ఎక్కువగా కోరుకోవడం మారుతున్న ప్రాధాన్యతలను వెల్లడి చేస్తుంది. కరణ్ జోహార్ 16 ఏళ్ళ క్రితమే వివాహ సంబరాల గురించి తీసిన  డాక్యుమెంటరీ "కభీ ఖుషి కభీ ఘమ్"లో తల్లి తండ్రులను ప్రేమించమని ఇచ్చిన సందేశం నేటి యువతను ఆకట్టుకొంటున్నట్లున్నది. 

సరైన జీవిత భాగస్వామిని ఎంచుకొంటున్నామనే నమ్మకం మీకు ఎప్పుడు కలుగుతుందని ప్రశ్నిస్తే తల్లితండ్రులు సమ్మతి తెలిపినప్పుడు అని 72 శాతం మంది మగువలు చెప్పగా, యువకులలో 56 శాతం మంది మాత్రమే ఆ విధంగా చెప్పారు. మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటారని అడిగితే పెళ్ళికి సిద్దమైనప్పుడు అని 9 శాతం మంది యువతులు, 12 శాతం మంది యువకులు చెప్పారు.