తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బీసీసీఐపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా భారత్ రెండు సిరీస్‌ల్లో పాల్గొనక పోవడంతో నష్ట పరిహారంగా రూ.457 కోట్లు చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కొద్ది రోజుల్లో బీసీసీఐపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్టు పీసీబీ చైర్మన్ నజామ్ సేథి తెలిపాడు. ‘2014 ఒప్పందంలో భాగంగా 2015-2023 మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాల్గొనాలి. ఇందులో భాగంగా పాక్ లో ఆరంభ సిరీస్ నిర్వహించాలి. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్-పాక్ తలపడుతున్నాయి. తటస్థ వేదికలపై ఆడేందుకు కూడా బీసీసీఐ సుముఖంగా లేదు. దీంతో మేము భారీగా నష్టపోతున్నామ’ని సేథీ తెలిపాడు.