//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కుంబ్లే కొనసాగింపుపై కోహ్లీ అభ్యంతరం...ఇరకాటంలో బీసీసీఐ

Category : sports

టీంఇండియా కోచ్ గా అనిల్ కుంబ్లే ను కొనసాగించడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడంతో బీసీసీఐ ఇరకాట పరిస్థితులను ఎదుర్కొంటున్నది . ఈ విషయమై ఎటూ చెప్పలేక సచిన్ టెండూల్కర్, సౌరవ్  గంగూలీ, వివియస్ లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ సందిగ్ధత స్థితిలో పడింది.

 బీసీసీఐ యాక్టింగ్ కార్యదర్శి అమితాబ్  చౌదరి,సీఈఓ రాహుల్ జారీ, జనరల్ మేనేజర్ డా. యంవి శ్రీధర్ కలసి కోహ్లీతో గంటకు పైగా సమావేశమై నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. కుంబ్లేతో కలసి పనిచేయడం సాధ్యం కాదని కోహిలి తేల్చి చెప్పేసారు. 

సలహా కమిటీ సభ్యులు ఈ రోజు కుంబ్లే తో కూడా సమాలోచనలు  జరుపనున్నారు. కుంబ్లే-కోహ్లీ ల మధ్య సయోధ్య కుదిర్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కోచ్ గా కుంబ్లే పని తీరులో తప్పు పెట్టె సందర్భం ఏదీ లేనప్పుడు కేవలం కెప్టెన్ వద్దన్నారని తీసివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

 కోహ్లీ ఎంతటి ప్రతిభావంతుడైన క్రీడాకారుడైనా సహేతుకమైన కారణం లేకుండా మొత్తం కెప్టెన్ చెప్పిన్నట్లు జరగాలి అంటే యెట్లా ? కొత్తగా నియమించే కోచ్ తో కూడా కోహ్లీకి పడక పోతే ఏమి చేయాలి ? .. ఈ ప్రశ్నలు ఇప్పుడు బీసీసీఐ ని వేధిస్తున్నాయి. 

ఈ నెల 23 నుండి జులై 9 వరకు వెస్ట్ ఇండియాస్ లో జరిగే సిరీస్ వరకు కొనసాగమని కుంబ్లే కు సుప్రీం కోర్ట్ నియమించిన పాలక కమిటీ కోరింది. అయినా జట్టుతో పాటు వెస్ట్ ఇండియాస్ కు వెళ్తున్నారా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.