//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వార్నర్ కోరికను తిరస్కరించిన బీసీసీఐ...!

Category : sports

సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కోరికను బీసీసీఐ తిరస్కరించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు బీసీసీఐ మరో షాకిచ్చింది.

బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఐపీఎల్‌కు సైతం దూరమైన డేవిడ్ వార్నర్‌ను మ్యాచ్‌లు చూసేందుకు వస్తాను అన్న సైతం బీసీసీఐ అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు భారత్ వస్తానన్న వార్నర్‌కు బీసీసీఐ వద్దని చెప్పినట్టు తెలుస్తుంది .

ఇటీవల వార్నర్ మాట్లాడుతూ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ ఆడే ఏదో ఒక మ్యాచ్‌ను చూసేందుకు భారత్ వస్తానని చెప్పుకొచ్చాడు. అయితే, తాజాగా వార్నర్ భార్య క్యాండైస్ మాట్లాడుతూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌లను దగ్గరుండి చూడాలని వార్నర్ చాలా ఆరాటపడుతున్నాడని, ఇందుకోసం అతడు భారత్‌కు రావాలనుకుంటున్నాడని పేర్కొన్నారు.

అయితే, బీసీసీఐ మాత్రం వార్నర్‌ను భారత్ రావద్దని చెప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మాత్రం తప్పకుండా వస్తాడని పేర్కొంది. ఇష్టపడే జట్టును కలిసి మద్దతు ఇచ్చేందుకు వార్నర్‌కు కుదరడం లేదని పేర్కొంది. కాగా, బీసీసీఐ తీరుపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతడిని నిషేధించింది ఆడకుండా మాత్రమేనని గుర్తు చేస్తున్నారు. మ్యాచ్‌లు చూసే స్వాతంత్ర్యాన్ని కూడా అతడి నుంచి లాక్కోవడం దారుణమని మండిపడుతున్నారు.

Related News