//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్‌-పాక్‌ మ్యాచ్ రీషెడ్యూల్‌కి డిమాండ్ చేసిన బీసీసీఐ...!

Category : sports

భారత్ ఆడే ప్రతి మ్యాచ్ కి ఎంత క్రెజ్ ఉంటుందో అందరికి తెలుసు. ఇంకా అందులో ప్రత్యర్థిగా పాక్ అయితే ఆ మజానే వేరు. చాలా కాలం తరువాత భారత్‌-పాక్‌ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పుడు ఆ మ్యాచ్ పై క్రికెట్ ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే....

దుబాయ్‌ వేదికగా సెప్టెంబరు 15న మొదలయ్యే ఆసియా కప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబరు 18న క్వాలిఫయర్‌తో ఆడాలి. ఆ మరుసటి రోజే.. అంటే 19న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్‌ రెండో మ్యాచ్‌లో తలపడాలి. ఇలా వరుసగా రెండురోజులు భారత్‌ మ్యాచ్‌లు ఆడాల్సిరావడంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు పాక్‌కు మాత్రం భారత్‌తో మ్యాచ్‌కు ముందు రెండ్రోజుల విరామం దొరుకుతోంది.

దీనిపై బీసీసీఐ బోర్డు గుర్రుగా ఉంది. ‘షెడ్యూల్‌ వేసేముందు కొంతైనా బుర్ర పెట్టి ఆలోచించారా. ఈరోజు మ్యాచ్‌ ఆడిన జట్టు రెండో రోజే మరో మ్యాచ్‌కు ఎలా సిద్ధమవుతుంది. అందునా ఇది సాధారణ మ్యాచ్‌ కాదు. భారత్‌-పాక్‌ సమరం. ఇదెంత మాత్రం క్షేమం కాదు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను రీ షెడ్యూల్‌ చేయాల్సిందే అని బీసీసీఐ పట్టు పట్టినట్టు సమాచారం.