ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో తిరుగులేని ప్రదర్శనతో ఫైనల్ చేరిన మిథాలీ సేనకు ఫైనల్స్ కన్నా ముందే బీసీసీఐ భారీ నగదు నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులకు తలో రూ.50 లక్షలు నగదు నజరానా ప్రకటించింది. సహాయ సిబ్బందికి తలో రూ.25 లక్షలు ప్రకటించింది
అంచనాలే లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. సారథి మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ కౌర్, వేద కృష్ణమూర్తిల బ్యాటింగ్ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే.
అలాగే రాజేశ్వరీ గైక్వాడ్, జులన్ గోస్వామి, శిఖ పాండే, ఏక్తా బిష్ఠ్ అద్భుత బౌలింగ్‌తో జట్టుకు విజయాలు అందించారు. దీంతో మహిళా క్రికెటర్లకు గతంలో ఎన్నడూ లేనంత ప్రచారం, గుర్తింపు లభించింది.