జీఎస్టీ అమలుతో బ్యాంకులు, బీమా కంపెనీలు అందించే ఆర్థిక సేవలు, మరింత భారం కానున్నాయి. ఇఎంఐలు, క్రెడిట్, డెబిట్ల వినియోగంపై పన్నులు భారం పెరగనుంది. జీఎస్టీ అమలుతో సేవా పన్ను 18 శాతం శ్లాబు పరిధిలోకి రానుంది. దీంతో ప్రస్తుతం 15 శాతం పన్నులు చెల్లిస్తున్న వినియోగదారులు ఇకపై 18 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
దానితో వారు చెల్లించే బిల్లులపై మూడు శాతం పన్నులు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు లక్ష రూపాయలకు వార్షిక ప్రీమియంలు రూ.25,000 చెల్లిస్తున్నవారు ప్రస్తుతం అమలులో ఉన్న 15 శాతం పన్ను విధానం ప్రకారం రూ.3,750 పన్ను కడుతున్నారు. అదే జీఎస్టీ అమలులోకి వస్తే 18 శాతం పన్ను విధానం కింద రూ.4,500 భారం పడే అవకాశం ఉంది.
అదే ఎస్బిఐ బీమాకు నగదు ప్రీమియంలు చెల్లించాల్సి వస్తే గతంలో రూ.10వేలుకు రూ.50 బ్యాకు రుసుము, సేవా పన్ను రూ.1500 కలిపి రూ.1550 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సేవా రుసుము రూ.50, 18 శాతం శ్లాబ్ పరిధిలో రూ.1800 కలిపి రూ.1850 చెల్లించాల్సి ఉంటుంది.
జీఎస్టీ అమలులోకి రావడంతో సేవల రుసుములు కూడా పెరుగుతున్నట్లు బ్యాంక్ లు ఇప్పటికే తమ ఖాతాదారులకు సందేశాలను పంపాయి. ప్రభుత్వ బ్యాంక్ లు యస్ యమ యస్ ద్వారా సందేశాలను పంపితే, ప్రైవేట్ బ్యాంక్ లు ఇ మెయిల్ ద్వారా ఇదే విషయాన్ని వారి వినియోగదారులకు తెలిపారు.