//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అసియా కప్ ని ఘనంగా ప్రారంభించిన బంగ్లాదేశ్‌....శ్రీలంక పై భారీ విజయం.....!

Category : sports

ఆసియా కప్‌లో సంచలనాల బంగ్లాదేశ్‌ ఘనంగా స్టార్ట్ చేసింది . తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 137 పరుగుల భారీ తేడాతో ఓడించి ,అసియా కప్ లో బంగ్లా ఘనం గా అరబించింది . టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం 262 లక్ష్యం తో ఛేదనకి దిగిన లంక 124 పరుగులకే చేతులెత్తేసింది. ఉపుల్‌ తరంగ(27), పెరీరా(29), లక్మల్‌(20), మథ్యూస్‌(16), కుశాల్‌ పెరీరా(11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బంగ్లా బౌలర్లలో మొర్తాజా 2, రహ్మాన్‌ 2, హసన్‌ 2 రాణించారు .

అంతకుముందు ఆదిలోనే భారీ దెబ్బ.. తమీమ్‌ ఇక్బాల్‌(2*) రిటైర్‌హర్టయ్యాడు. లిటన్‌ దాస్‌, షకిబ్‌ అల్‌ హసన్‌ డకౌట్‌లుగా వెనుదిరిగారు. అయినప్పటికీ బంగ్లా పోటీ ఇవ్వగల స్కోరు చేసిందంటే మాత్రం దానికి కారణం ముష్ఫికర్‌ రహీమ్‌ అనే చెప్పాలి . అద్భుతమైన శతకం(150బంతుల్లో 144, 11*4, 4*6)చేసి.. మహ్మద్‌ మిథున్‌(63) కలిసి అమూల్యమైన మూడో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

అయితే ఇతర బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో 261 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్లా(1), హుస్సైన్‌(1), హసన్‌(15), మొర్తాజా(11), రుబెల్‌(2), ముస్తిఫికర్‌(11) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లసిత్‌ మలింగ(4/23), ధనుంజయ (2/38), లక్మల్‌, అమిలా, పెరీరా తలో వికెట్‌ పడగొట్టారు.

#BangladeshwontheMatch #Sportsnews #sportslatestupdates #telugunews