//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బంగారు లక్ష్మణ్ సతీమణి మృతి !

Category : national

బీజేపీ మాజీ జాతీయ అద్యక్షుడు బంగారు లక్ష్మణ్ సతీమణి, మాజీ ఎమ్.పి సుశీల నిన్న మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 70 ఏళ్లు. ఆమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాదపడుతున్నారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆమె ఫిబ్రవరి నెల 17న ఆసుపత్రిలో చేరారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. డయాలిసిస్‌ కొనసాగుతుండగానే ఆమె సుమారు రాత్రి ఏడుగంటల ప్రాంతంలో మృతి చెందారు.

గతంలో ఆమె రాజస్థాన్ లోని జాలోర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా గెలుపొదారు. కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ పై ఆమె విజయపతాకం ఎగురవేశారు. బంగారు లక్ష్మణ్ గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సుశీల మరణవార్త తెలుసుకొని బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలివచ్చారు.

ఆమె భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని స్వగృహానికి తరలించారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆమె మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్‌ సంతాపం ప్రకటించారు.