అల్లర్లు జరిగినప్పుడు,ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం గురించి తెలుసు కానీ, ఇథియోపియాలో మాత్రం విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడగానే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు,మాస్ కాపీయింగ్ అక్కడ విపరీతంగా పెరిగిపోయిందటా అలాగే ఇథియోపియాలో గత కొన్నేళ్లుగా పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు కూడా బాగా పెరిగాయి. పరీక్షలు మొదలు కాకముందే ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ సమస్యకు అధిగమిచ్చేందుకు ఆలోచించిన అక్కడి అధికారులు పరీక్షల సమయంలో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని నిరణయించుకున్నారు. అందుకే త్వరలో పదో తరగతి పరీక్షల ప్రారంభం అవుతుండటంతో ఇథియోపియా దేశవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి ఇంటర్నెట్ను నిలిపివేశారు. వచ్చే వారం 12వ గ్రేడ్ విద్యార్థులకు కూడా పరీక్షలు ఉండటంతో అప్పటిదాకా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.