//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అరటి పండు జుట్టుకి చేసే మేలు

Category : health state

ఈ మాస్కు పొడి జుట్టుకు కావాలసినంత తేమను అందిస్తుంది. వెంట్రుకల సాగేగుణాన్ని మెరుగుపరుస్తుంది. బాగా పండిన రెండు అరటిపళ్లు తీసుకుని బాగా గుజ్జులా చేయాలి. అందులో రెండు టేబుల్‌స్పూన్ల తేనె కలిపి మెత్తటి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టును వెంట్రుకలకు రాసుకుని షవర్‌క్యాప్‌ పెట్టుకోవాలి. అరగంట తర్వాత నీటితో వెంట్రుకలను బాగా కడిగేసుకోవాలి.

అరటిపండు-ఆలివ్‌ ఆయిల్‌: ఈ మాస్కు వల్ల దెబ్బతిన్న వెంట్రుకలు చక్కబడతాయి. ఒకే ఒక మెత్తటి అరటిపండు తీసుకుని అందులో రెండు టేబుల్‌స్పూన్ల ఎక్స్‌ట్రావర్జిన్‌ ఆయిల్‌ వేసి మెత్తగా పేస్టులా చేయాలి. ఆ పేస్టును బ్రష్‌ సహాయంతో వెంట్రుకలకు రాసుకుని తలకు షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత తలను షాంపుతో శుభ్రంగా రుద్దుకొని తలస్నానం చేయాలి.

అరటిపండు-బొప్పాయి-తేనె మాస్కు: ఈ మాస్కులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రాసుకోవడం వల్ల జుట్టుకు మెరుపు రావడమే కాదు వెంట్రుకలు పటిష్టంగా ఉంటాయి కూడా. బాగా పండిన అరటిపండును కచ్చాపచ్చాగా చేయాలి. దాంట్లో బాగా పండిన నాలుగైదు బొప్పాయి ముక్కలను వేయాలి. ఈ రెండెంటిని కలిపి గుజ్జులా చేయాలి. ఇందులో రెండు టీస్పూన్ల తేనె కలిపి పేస్టులా చేయాలి. మాడు మీద, తలకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. వెంట్రుకలను ఒకచోటకు చేర్చి ముడి వేసి తలకు షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. కాసేపైన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వెంట్రుకలను బాగా కడిగేసుకొని షాంపుతో తలస్నానం చేయాలి.

Related News