Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లేడీ విలన్ నీ నమ్ముకున్న బాలయ్య.... ఇందుకోసం కోలీవుడ్ క్రేజీ భామ ను పట్టిన ఈ చిత్ర దర్శకుడు.

Category : movies

నందమూరి బాల కృష్ణ ఇటీవల నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కాస్త డిజాస్టర్ గా నిలవడం తో.... ఆ సినిమా తరువాత బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు..... కానీ, బోయపాటి తాజా చిత్రం " వినయ విధేయ రామ " సైతం అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆయనతో ముందుగా చేయాలనుకున్న సినిమాను కాస్త పక్కన పెట్టక తప్పలేదు.ఈ నేపథ్యంలోనే హీరో బాలకృష్ణ - సీనియర్ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కామినేషన్ లో " జై సింహ" చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించగా..రెండోసారి వీరిద్దరి కాంబో లో రెండో సినిమా తెరకెక్కుతుండటం అందరిలో ఆసక్తి ని కలిగిస్తుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హరిప్రియ ను ఎంపిక చేస్తున్నారనే వార్తలు వినిపిస్తుండగా ....అలాగే ఈ సినిమాలో ఓ లేడీ విలన్ పాత్ర కోసం కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

ఆ క్రేజీ హీరోయిన్ ఎవరో కాదు తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి. ఇప్పటికే పలు రకాల సినిమాల్లో వైవిధ్య భరితమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ భామ. ఇప్పటివరకు లేడీ విలన్ గాను ఇరగ దీసింది అలా పందెం కోడి -2, సర్కార్ వంటి సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించింది.ఇక పోతే ఈ అమ్మడు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో లేడి విలన్ గా పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాలో అలాంటి రోల్ రావడం విశేషం. అలాగే జగపతిబాబు కూడా ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్‌ గా నటించబోతున్నారట. లెజెండ్‌ తర్వాత బాలకృష్ణ, జగపతిబాబు కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా..ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంటర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మే 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుంది. అలాగే జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

Related News