Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీవారి ఆలయం లో కీలక ఘట్టం.... మూలవిరాట్ పద్మ, పాద పీఠాలకు నేడే అష్టబంధనం.!

Category : history state

తిరుమల గిరి ప్రస్తుతం మహా సంప్రోక్షణ కార్యక్రమంతో మారుమోగిపోతుంది. 12 ఏళ్ళకి ఒకసారి జరిపించే అష్టబంధన బలాలయ మహాసంప్రోక్షణ కార్యం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు . మహా సంప్రోక్షణ పూజలో భాగంగా నేను కీలక ఘట్టం మొదలుకాబోతుంది.

ఈ కీలకమైన ఘట్టం లో భాగం గా ఎనిమిది రకాల ద్రవ్యాలను కలిపి, పాకంగా తయారు చేసిన అష్టబంధనాన్ని నేతు స్వామివారి పద్మపీఠానికి, పాద పీఠానికీ ఇలా స్వామి వారికీ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు సమక్షంలో సమర్పించనున్నారు.

ఒక్కో ద్రవ్యం 5 తులాల చొప్పున తీసుకున్న ఎనిమిది ద్రవ్యాలనూ చేతితో రోటిలో వేసి గంటసేపు దంచిన తరువాత, తయారైన పాకాన్ని ఓ పాత్రలోకి తీసుకుని దాన్ని దారంలా పెనవేసి, పాద, పద్మ పీఠాల మధ్యలో మెత్తిస్తారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు అంటే, ఇలా ఆ పాకాన్ని మెత్తించటం వల్ల మరో 12 సంవత్సరాల పాటు స్వామివారి విగ్రహం అణువంతైనా కదలకుండా నిలిచివుంటుంది. తరువాత అష్ట దిక్కుల్లో, ఆలయ ప్రాంగణంలోని వున్న ఉపాలయాల్లోనూ అష్టబంధనం చేయనున్నారు.

రేపటి కార్యక్రమాల్లో భాగంగా, ప్రధానార్చకులతో పాటు పలువురు రుత్విక్కులు శ్రీవారి ఆనంద నిలయంపైకి చేరుకోవాల్సి వుండటంతో ఆలయ ఇంజనీరింగ్ సిబ్బంది పటిష్ఠ నిచ్చెనను ఏర్పాటు చేశారు. నేడు సుమారు 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Related News