//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ధర్మ పోరాట దీక్ష లో సింహగర్జన....!

Category : politics movies

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష కొనసాగుతోంది. పలు సంఘాలు ఆయన దీక్షకు మద్దతు పలికాయి. ఉదయం 7 గంటలకే దీక్షకు కూర్చున్న ఆయనకు పలువురు సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. ముఖ్యంగా హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ చేసిన ప్రసంగం అక్కడ వున్న అందరినీ ఆకట్టుకుంది.

నందమూరి బాలకృష్ణ ధర్మపోరాట దీక్ష వేదికగా చేసిన ప్రసంగం హోరెత్తించింది . ముఖ్యంగా వైసీపీ, బీజేపీలను టార్గెట్ చేసుకుని ఆయన మాట్లాడారు. మోదీకి ఆర్థమయ్యేలా హిందీలో మాట్లాడడం మరింత ఆకట్టుకుంది. మోదీ ఇష్టమొచ్చినట్టు పాలించడానికి ఇది గుజరాత్ కాదన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

రాజకీయాల్లో మోదీ కంటే చంద్రబాబు సీనియర్ అన్న బాలయ్య.. సీనియర్లను ఎలా గౌరవించాలో మోదీ నేర్చుకోవాలని సూచించారు. సహకరిస్తారని, ఏపీని ఆదుకుంటారని భావించే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. మోదీ మాత్రం ఉత్తరభారతాన్ని, దక్షిణ భారతాన్ని వేర్వేరుగా చూస్తున్నారన్నారు. తెలుగోళ్లు పిరికివాళ్లు కాదన్న బాలయ్య.. తెలుగువారి సత్తా ఏంటో చూపిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని బాలకృష్ణ చెప్పారు. ఎందరో మహానుభావులకు ఈ గడ్జ జన్మనిచ్చిందన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోరుగడ్డ ఇదన్నారు. ఖబడ్దార్ మోదీ.. అని హెచ్చరించారు.