హిందూపురం ఎమ్మెల్యే , నందమూరి నటసింహం బాలయ్య బాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా గడ్డి అన్నారంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ..
‘కేసీఆర్.. ఆంధ్రా వస్తావా? రా చూద్దాం’ అని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు పేరు లేకుండా చేయాలంటే హైటెక్ సిటీ, ఫ్లైఓవర్లు తీసేయాలని అవి తీసే దమ్ముందా అని అయన ప్రశ్నించారు.
చంద్రబాబు చరిత్ర చెరిపితే చెరిగేది కాదన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమితే ఎక్కడికో ఓ చోటకి పోవాల్సిందేనన్నారు.
గత ఎన్నికల్లో తెలంగాణలో రైతుల ప్రభుత్వం వస్తుందనుకుంటే , రాబందుల ప్రభుత్వం వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్‌ది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అని ప్రసంగించి ఓటర్లను ఆకట్టుకున్నారు . టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక పాఠశాలలను, కాలేజీలను కూడా మూసివేసి బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు.