//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అర‌వింద స‌మేత‌పై ఎవ్వ‌రూ ఊహించ‌ని కామెంట్స్ చేసిన బాల‌కృష్ణ‌..!

Category : movies

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, ప్ర‌స్తుతం తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఎప్పటినుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం. అయితే, ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ నెల 11వ తేదీన రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో విజ‌య‌వంతంగా దూసుకుపోతుంది. అయితే, అర‌వింద స‌మేత స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌కు త‌మ అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ సైతం అర‌వింద స‌మేత చిత్రంపై జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న‌పై త‌న స్టైల్లో స్పందిస్తూ నా కుమారుడు ఎన్టీఆర్ త‌న స‌త్తా ఏమిటో అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాతో మ‌రో సారి రుజువు చేశాడు.

ఇటీవ‌లె రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన నా అన్న హ‌రికృష్ణ ఏ లోకంలో ఉన్నా.. ఆయ‌న ఆశీస్సులు మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటాయి. అందుకే, అర‌వింద స‌మేత విజ‌యాన్ని హ‌రికృష్ణ గారికి అంకితం చేసిన తార‌క్‌కు నిజంగా అభినంద‌న‌లు తెలుపుతున్నాను అంటూ బాబాయ్ బాల‌కృష్ణ‌.. అబ్బాయ్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అభినంద‌న‌లు తెలిపారు.