Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముదురుతున్న మెగాబ్రదర్,బాలకృష్ణ ల వార్ .. తాజాగా వీడియోలతో నాగబాబు సంచలనం

Category : movies

మెగా బ్రదర్ నాగబాబు, బాలయ్య వివాదం మరింత ముదురుతోంది. బాలకృష్ణ పై వరుసగా తన మాటలతో , వరుస పోస్ట్ లతో దాడి చేస్తున్న నాగబాబు మీద బాలయ్య ఫాన్స్ చేస్తున్న ట్రోల్స్ మీకు తెలుసు. ఇక తాజాగా ఇన్ డైరెక్ట్ గా చేస్తున్న దాడి పైన కూడా నాగబాబు స్పందించారు. ఆయన తమ మెగా బ్రదర్స్ పై 6 సార్లు మాటలతో దాడి చేసి తాము బాధ పడేలా ప్రవర్తిస్తే తప్పు లేదు కానీ తానేదో సరదాగా ఇంటర్వ్యూ లో మాట్లాడినదానికి ఇంతగా ఫీల్ అయితే ఎలా అంటూ మండిపడ్డారు. ఇక నుండి రోజు ఉదయం 9గంటలకు , రాత్రి 9 గానతలకు బాలకృష్ణ తమ మెగా బ్రదర్స్ పై చేసిన కామెంట్స్ ను పోస్ట్ చేస్తాను మీరే చూసి చెప్పండి. మీరు చేస్తే తప్పు లేదు. మేం మాట్లాడితే తప్పా ... ఇది కరెక్ట్ కాదు అని నాగబాబు ఈ వ్యవహారాన్ని విడిచి పెట్టేదే లేదని చెప్తున్నారు. సాధారణంగా నేను ఎలాంటి కాంట్రవర్సి ల జోలికి పోనని అలాంటి నేనే ఇలా కౌంటర్ చేస్తున్నా అంటే ఎంతగా బాధ పడి ఉంటామో ఆయనకు తెలియాలని అన్నారు.

నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీతో పాటు, రాజకీయాల్లోనూ కలకలం రేపాయి. ఆ తర్వాత రెండు రోజులకు ఆ కామెంట్‌కు వివరణ ఇస్తున్నట్లుగా ఓ వీడియోను వదిలాడు. అందులో ‘‘బాలకృష్ణ ఎవరో నాకు తెలియదన్నాను. వాస్తవానికి ఆయనో పెద్ద కమెడియన్’’ అంటూ వల్లూరి బాలకృష్ణ ఫోటో చూపించాడు. అంతేకాదు, ‘‘ఈయనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది. ఆ నిక్‌నేమ్ ఏంటంటే.. అంజిగాడు’’ అని వివరించాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అయ్యారు. ఈ వివాదం అప్పటితో ఆగిపోలేదు. దీని తర్వాత కూడా బాలయ్యను ఉద్దేశించి పలు పోస్టులు పెట్టాడు. దీంతో నందమూరి అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’ సినిమాను ఆడనివ్వమని కూడా హెచ్చరించారు. అయినా, నాగబాబు తన పంథాను మార్చుకోలేదు. ఆయనకు మెగా అభిమానులు బాసటగా నిలిచారు. తాము కూడా తక్కువ కాదన్నట్లు ‘యన్.టి.ఆర్’ సినిమాను విడుదల కానివ్వమని బెదిరించారు. ఇది మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ వివాదంగా కాకుండా అభిమానుల మధ్య రగడ గా మారుతోంది.

ఈ వివాదం మరింత పెద్దగా అవుతున్న తరుణంలో నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ‘‘ఇటీవల నేను ఓ వ్యక్తిపై చేసిన కామెంట్స్ చాలా విదాస్పదమయ్యాయి. నేను సాధారణంగా వివాదాలు, కాంట్రవర్శీల జోలికి వెళ్లను. ఇలాంటి వాటిజోలికి వెళ్లి ఫోకస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న పేరు, గుర్తింపు చాలు. నేనిచ్చిన కామెంట్స్‌కి ఓ పర్పస్ ఉంది. చాలా మంది ‘పవన్ కల్యాణ్ నాకెవరో తెలియదు అన్నారు కాబట్టి దానికి కౌంటర్ ఇచ్చారు. ఒక్కమాటకే అంత ఫీలయిపోతే ఎలా? సరే.. ఇచ్చిందేదో ఇచ్చారు కదా. మళ్లీ మళ్లీ ఎందుకివ్వాలి?’ అన్నారు కదా. దానికి నా సమాధానం ఏంటంటే.. ఆ వ్యక్తి ఇప్పటికి ఆరుసార్లు మా ఫ్యామిలీ మీద.. మా అన్నదమ్ముల మీద కామెంట్స్ చేశాడు. దీనికి నేను తిరిగి సరదాగా.. నవ్వుతూ ఫన్నీగా చేశాను తప్ప సీరియస్‌గా చేయలేదు. నిజానికి నేను 100% ఆ వ్యక్తిని టార్గెట్ చేయలేదు. కానీ టార్గెట్ చేశానని మీరు భావిస్తున్నారు కదా.. అయితే ఓకే. మాపై ఆ వ్యక్తి చేసిన కామెంట్స్ మీరు కూడా వినండి’’ అంటూ బాలయ్య మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అన్న కామెంట్ల వీడియోలను విడుదల చేసే పని మొదలు పెట్టారు . ఈ వీడియోలను ఆరు పార్టుల కింద విడుదల చేస్తానని చెప్పిన నాగబాబు.. రోజు రాత్రి 9 గంటలకు ఒకటి, ఉదయం 9 గంటలకు ఒకటి విడుదల చేస్తానని వెల్లడించాడు.

ఇక ఆయన విడుదల చేసిన రెండు వీడియో లలో బాలయ్య పవన్ కళ్యాణ్ తనకు ఎవరో తెలీదు అన్న కామెంట్ వుంది. ఇక దాని మీద నాగబాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో మీ బావ చంద్రబాబు అడిగితే తాను పోటీ చెయ్యకున్నా చంద్రబాబు మంచి సీనియర్ నాయకుడు అన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే పవన్ ఎవరో మీకు తెలీదా .. ఇది కరెక్ట్ కాదు. అని కౌంటర్ ఇచ్చారు. ఇక రెండో వీడియో లో పవన్ కళ్యాణ్ గురించి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు మేం ఎవర్నీ హీరోలను చెయ్యదలుచుకోవటం లేదు. మాకు మేమే సూపర్ స్టార్ లం అన్నారు బాలయ్య. ఇక దీనికి కౌంటర్ గా హీర్లను మీర్ కాదు చేసేది .. ప్రజలు చెయ్యాలి. సూపర్ స్టార్ లు మేమే అని చెప్పుకుంటే సరి పోదు. ప్రజలు మెచ్చుకోవాలి. మీరే కాదు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ లు ఉన్నారు. అంత మేమే మేం తప్ప స్టార్ లే లేరు అన్న ధోరణి కరెక్ట్ కాదు అంటూ మళ్ళీ ఒక పంచ్ ఇచ్చారు నాగబాబు. ఇక ఇలా మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీ కి మధ్య యుద్ధం బాగా ముదురుతున్న నేపధ్యంలో ఫ్యాన్స్ లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలా మారుతుందో చూడాలి.

Related News