Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ పై ఫ్యాన్స్ ఫైర్....!

Category : movies

బాలయ్య అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఆయన సినిమాల్లో ఎంత రచ్చ చేస్తాడో...ఆయన ఫ్యాన్స్‌కూ బయట అంతే సందడి చేస్తారు. తాజాగా నందమూరి నాయకుడు బాలకృష్ణ మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాకు ఓ టైటిల్‌ను సెట్ చేశారు. అయితే ఆ టైటిల్ వద్దని ఇప్పుడు బాలయ్య అభిమానులు రచ్చ చేస్తున్నారు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ తర్వాత బాలకృష్ణ కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి ‘రూలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.అయితే ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేద్దామని అనుకుంటున్నారు మూవీ టీం. ఈ వారమే సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో బాలయ్య అభిమానులకు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఈమూవీకి 'రూలర్' అన్న టైటిల్ ఫిక్స్ చేయడం తమ ఇగో ను దెబ్బతీస్తోందని చెబుతున్నారు.

ఎందుకంటే బోయపటి తీసిన జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ సినిమాలో రూలర్ అన్న పాట ఉంది. ఆ పాట సూపర్ హిట్ కూడా అయ్యింది. అయితే అదే టైటిల్‌తో అప్పట్లో జూనియర్ కూడా సినిమా తీయాలనుకున్నాడట. అది కుదరలేదు. దీంతో ఇప్పుడు అదే ‘రూలర్’ బాలయ్య సినిమాకు టైటిల్ పెట్టడం అభిమానులకు అంత నచ్చడం లేదంట. ఎవర్నీ ఫాలో కాని బాలకృష్ణ జూనియర్‌ను ఫాలో అవుతున్నాడా అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారట. మరి అభిమానుల అభ్యంతరాలపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.ఇప్పటికే ' ఎన్టీఆర్ బయోపిక్’ కాస్త డిజాస్టర్ కావడంతో బాలయ్య మార్కెట్ కాస్త డౌన్ అయిపోయింది.ఈ దెబ్బతో బాలయ్య ఏ సినిమా ఏ డైరెక్టర్ తో తీయాలి అన్న....కాస్త ఆచి తూచి అడుగులు వేయక తప్పడం లేదు.ఈ నేపథ్యంలోనే ముందుగా బాల కృష్ణ అనుకున్నట్టు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అనుకున్న....

వినయ విధేయ రామ సినిమాతో భారీ ఫ్లాప్ ఇవ్వడంతో బోయపాటి సినిమాను పక్కన పెట్టిన బాలయ్య. ప్రస్తుతం కె.ఎస్ రవి కుమార్ దర్శకత్వం లో రానున్న సినిమా పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.అయితే తాజా గా ఈ సినిమా టైటిల్ విషయంలో తలెత్తిన సమస్య పై బాలయ్య మళ్లీ డైలమాలో పడినట్టు తెలుస్తోంది.

Related News