//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ హౌస్ లో బాలయ్య ...!

Category : movies

బిగ్ బాస్ హౌస్‌లో బాలయ్య ఏంటి అనుకుంటున్నారా..డైరెక్ట్ గా ఆయన రాలేదు కానీ.. బాలయ్య ప్రస్తావన మాత్రం వచ్చింది. హౌస్ మేట్స్‌తో నాని జరిపిన సంభాషణల్లో భాగంగా ఈ నందమూరి అందగాడిపై ప్రశంసల జల్లు కురిపించారు. బాలకృష్ణ తరహాలో సామ్రాట్ డైలాగ్ చెప్పాడు. వెంటనే అందుకున్న నాని ఈ షో నటసింహం చూస్తే వేరేలా ఉంటుందన్నారు.

అయితే తనకు బాలయ్యకు మధ్య మంచి అనుబంధముందని చెప్పుకొచ్చాడు సామ్రాట్. గతంలో ఇద్దరం కలిసి క్రికెట్ ఆడామని.. ఆ సందర్భంగా ఆయనకు బాల్ తగులుతుందనే ఉద్దేశంతో 14 వైడ్లు వేశానని.. అయితే ఆయన మాత్రం ఏం ఫర్వాలేదు బాల్ వెయ్యి అంటూ తనను ప్రోత్సహించాడన్నారు.

దీనిపై స్పందించిన నాని ఆయనది చిన్నపిల్లోడి మనస్తత్వమని పది నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుందన్నారు.

అలా బాలయ్య ప్రస్తావనతో హౌస్ అంతా కొద్దిసేపు నవ్వుల్లో మునిగిపోయింది. బాలకృష్ణ డైరెక్ట్ గా హౌస్ లోకి రాకపోయినా కూడా బిగ్ బాస్ హౌస్ లో బాలయ్య గురించి చర్చజరిగింది .