Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్పందించడానికి ఇది సమయం కాదు మిత్రమా : బాలకృష్ణ

Category : movies

మొదటిసారి నాగబాబు కౌంటర్ లపై బాలకృష్ణ స్పందించారు.మెగా ఫ్యామిలీని విమర్శిస్తూ గతంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నటుడు నాగబాబు ఇటీవల వరుస వీడియోలతో కౌంటర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈరోజు తిరుమలలో ఓ మీడియా ప్రతినిధులు నేరుగా బాలకృష్ణను అడిగేసారు.

ఎన్టీఆర్ బయోపిక్ రేపు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకొని బయటకు వస్తున్న సమయంలో 'బాలకృష్ణ'ను నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు అడిగారు. దింతో అయన నవ్వి 'ఇది సమయం కాదు మిత్రమా' అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే నాగబాబు ఐదు వీడియోలు విడుదల చేశారు. ఇంకో వీడియోను కూడా ఈరోజు విడుదల చేస్తామని ప్రకటించారు.