//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చేతికి కట్టుతో అసెంబ్లీకి బాలకృష్ణ ..!

Category : politics

టాలీవుడ్ హీరో,హిందుపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు చేతి కట్టు తో హాజరైయ్యారు.అయన ఈ మద్యే హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

బాలయ్య కు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌లో కుడిభుజానికి గాయమైంది. ఆ దెబ్బ ను లెక్కచేయకుండా సినిమాలు చేసారు . తరువాత ఆనొప్పి తిరగతోడడంతో ఆయన ఇటీవల చికిత్సచేయించుకున్నారు.కట్టుతో అసెంబ్లీకి వచ్చిన బాలకృష్ణను మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించారు.

అంతకుముందు వెంకటపాలెంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, బాలకృష్ణ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులుర్పించారు. తరువాత బాలయ్య మీడియాతో మాట్లాడుతూ ఈనెల 29న ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభిస్తామన్నారు. ఈ సినిమాకు చాలా మంది చాలాపేర్లు సూచించారని అన్నారు . ఎన్టీఆర్‌కు మించిన పేరు లేదని భావించి ఆపేరే ఖరారు చేశామని వెల్లడించారు. ఈనెల 31, ఏప్రిల్‌ 1న లేపాక్షి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని బాలకృష్ణ చెప్పారు.