//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడ్ర‌న్ రిక్షా రాముడు

Category : movies

తెలుగు వారు ఎంతో ఇష్టం గా పిలుచుకునే విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ‌, అన్న‌గారు ఎన్టీఆర్‌ రిక్షావాలాగా మారితే ఎలా ఉంటుంది ఒక్క సరి అనుకండి ? పైగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో.. నెత్తిన హ్యాట్ ధ‌రించి.. క‌ళ్ల‌కు రెబాన్ పెట్టుకుని .. రిక్షా తొక్కితే ఎలా ఉంటుంది? ఆ స్టైలే వేరులే. ఇదిగో అందుకు సింబాలిక్ గానే క‌నిపిస్తోంది ఈ ఫోజు.

న‌ట‌సింహా నంద‌మూరి బాలయ్య న‌టిస్తున్న `ఎన్టీఆర్‌` ఆన్ లొకేష‌న్ స్టిల్స్ ఇది.రిక్షా వాలా అంటే చెమ‌ట‌ల‌తో త‌డిసి ముద్ద‌యిపోయే గెట‌ప్ అనుకుంటే పొర‌పాటు.. ఇంత స్టైలిష్ రిక్షావాలాను ఇదివ‌ర‌కెన్న‌డూ చూసి ఉండ‌రు అన్న‌ట్టే క‌నిపిస్తోంది. అప్ప‌ట్లో అన్న‌గారు ఎన్టీఆర్ వేట‌గాడు సినిమాలో ఈ త‌ర‌హాలో హ్యాట్ ధ‌రించి క‌నిపించారు.

ఈ గెట‌ప్ ఓ పాట చిత్రీక‌ర‌ణ కోసం అయి ఉండొచ్చు. ఇక‌పోతే ఇప్ప‌టికే ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్‌- మ‌హానాయకుడు అంటూ రెండు భాగాలుగా ఈ బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్నారు క్రిష్. 2019 జ‌న‌వ‌రిలో ఈ రెండు సినిమాల్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం దివి సీమలో షూటింగ్ కొనసాగుతున్నది.