//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మార్కెట్లోకి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160

Category : business

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో..పల్సర్ విభాగంలో మరో నూతన బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. 160 సీసీ సామర్థ్యం కలిగిన పల్సర్ ఎన్‌ఎస్ 160 ధరను రూ.80,649గా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూంకు సంబంధించినవి. భారత్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ప్రీమియం సెగ్మెంట్‌లో మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ నూతన బైకును విడుదల చేసినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ ఎరిక్ వ్యాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న స్పోర్ట్ బైకుల్లో 150-160 సీసీ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్ల వాటా 70 శాతంగా ఉందన్నారు.