//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చైనాలో రేపు బాహుబ‌లి 2విడుద‌ల

Category : movies

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన సినిమా బాహుబ‌లి. బాహుబ‌లి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన‌ సినిమా. తెలుగు సినీ ఇండస్ట్రీ సత్తాను చాటిన సినిమా బాహుబ‌లి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి పేరు వ‌చ్చింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా 1600కోట్ల రూపాయిలు సంపాదించి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటేలా చాటి చెప్పింది. రెండు పార్టులుగా వ‌చ్చిన ఈ సినిమా ప్ర‌జ‌ల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమా సంచ‌ల‌నం సృష్టించింది.

ఇండియాలోనే కాకుండా ప‌లు దేశాల‌లో కూడా బాహుబ‌లి మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. ఇటివ‌ల ఈసినిమా జ‌పాన్ లో విడుద‌లై 100రోజులు పూర్తి చేసుకుని 1.3మిలియ‌న్ డాల‌ర్ల గ్రాస్ చేరుకుంది. ఎసినిమ‌కు రానంత క్రేజ్ బాహుబ‌లి వ‌చ్చింది. అయితే తాజాగా ఈ మూవీ రేపు చైనాలో ఐమాక్స్ ఫార్మాట్ లో 7000ల‌కి పైగా స్క్రీన్స్ లో విడుద‌ల చేయ‌నున్నారు. స్క్రీన్ల ప‌రంగా దంగ‌ల్ సినిమా రికార్డు బ్రేక్ చేసింది బాహుబ‌లి. కానీ భ‌జ‌రంగీ భాయిజాన్ సినిమాను మాత్రం దాట‌లేక‌పోయింది. భ‌జ‌రంగీ భాయిజాన్ చిత్రాన్ని చైనాలో మొత్తం 8000ల‌కి పైగా స్క్రిన్ ల‌లో విడుద‌ల చేశారు. చైనాలో రేపు విడుద‌ల కానున్న బాహుబ‌లి 2 సినిమా మ‌రెన్ని క‌లెక్ష‌న్లు, రికార్డు తీస‌కొస్తుందో చూడాలి.