Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ అభిమానులకి మరో చేదువార్త .....!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవిందసమేత వీర రాఘవ . ఈ సినిమా టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందుతుంది .ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది . దసరా బరిలో కి దిగనున్న ఈ చిత్రం ఇప్పటికే అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి . దానికి అనుగుణంగానే సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు .

ఇక పొతే అక్టోబర్ లో సినిమా రిలీజ్ ఉండబోతున్న తరుణం లో ఈ నెల 20 న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపాలని ముందు నిర్ణయం తీసుకున్నారు .కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని క్యాన్సల్ల్ అయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది .

దీనికి గల కారణం ఏమిటంటే సినిమా రిలీజ్ కి సమయం చాలా తక్కువగా ఉండడం తో ఇప్పుడు ఫంక్షన్ అంటే మరో రెండు నుండి మూడు రోజుల సమయం వృధా అవుతుంది అని అలోచించి .అదే రోజు డైరెక్ట్ గా పాటలని మార్కెట్ లోకి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం . దీనితో ఇప్పటికే ఆడియో ఫంక్షన్స్ కి వెళ్లాలని రెడీ అయిన అభిమానులకి కొంచెం అసహనం కలిగించే వార్త ఇది.