//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సినీ అభిమానులకు బ్యాడ్ న్యూస్

Category : national

రేపటి నుంచి సినిమా ధియేటర్లలో నిరవధిక బంద్ కొనసాగనుంది.

దక్షిణాది రాష్ట్రాల్లో సుమారు 5వేల ధియేటర్లు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. ఏపీ, తెలంగాణలో కలిపి సుమారు 2వేల ధియేటర్లలో తెరపడనుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళలోని సినిమా ధియేటర్ల యజమానులు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారు.

ఈ బంద్ కి కారణం ప్రస్తుతం సాంకేతికత పెరిగిన నేపథ్యంలో అంతా డిజిటల్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయితే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు.. ప్రొజెక్షన్ కోసం ఒక్కో తెరకు 22వేల 500 రూపాయలు వసూలు చేస్తున్నాయి. మరీ అంత భారీగా వసూలు చేస్తే మేం అన్యాయం అయిపోతామని సినిమా హాళ్ల ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి.

దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల జాయింట్ యాక్షన్ కమిటీ పలు దఫాలుగా చర్చించింది. కానీ, అవి ఫలితాన్నివ్వలేదు. దీంతో బంద్ అనివార్యమైంది. ప్రస్తుతం వసూలు చేస్తున్న 22వేల 500 రూపాయల చార్జిలో 25శాతం తగ్గిస్తే బంద్‌ను విరమించుకుంటామని జేఏసీ సభ్యులు తెలిపారు. కానీ, అందుకు డిజిటల్ సర్వస్ ప్రొవైడర్లు ఒప్పుకోకపోవడంతో బంద్ తప్పదని స్పష్టం చేస్తున్నారు.