//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దర్శకేంద్రుడికి చేదు అనుభవం ....ఓటు వేయకుండానే వెనుదిరిగిన రాఘవేంద్రరావు..!

Category : politics

ఓటు వేయడానికి వచ్చిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఓటింగ్ కేంద్రం వద్ద పెద్ద క్యూ ఉండటంతో జనం మధ్య నిలబడకుండా నేరుగా బూత్లోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించారు. దీంతో ఆయనను ఓటర్లు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లోని ఫిల్మ్ నగర్ లో ఈ సంఘటన జరిగింది.

పొద్దున్నే వచ్చి మేము క్యూలో నిల్చున్నాం. ఓటరు ఎవరైనా ఒకటే... ఇక్కడ సెలబ్రిటీ అంటూ అందరూ వచ్చి ఓటేసి వెళ్లిపోతే మేము ఎంత సేపు ఇక్కడ నిలడాలి అని పలువురు అరిచారు. అక్కడున్న ఒకరిద్దరు ఆయన రాఘవేంద్రరావు గారు ఓటేసి వెళ్లిపోతారు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటే ... మేము కూడా ఓటేయడానికి వచ్చాం.

ఆయన రాఘవేంద్రరావు అయితే ఏంటి క్యూలో రావాల్సిందే అంటూ వాదించారు. దీంతో రాఘవేంద్రరావు హర్ట్ అయ్యారు. ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. రద్దీ తగ్గాక వస్తారని ఆయన అనుచరులు చెప్పారు. కానీ వస్తారో రారో తెలియదు ....

Related News