తన కూతురు చివరి కోరిక తీర్చటానికి తల్లిదండ్రులు ఎవరు చేయని పని చేసారు.స్కాట్ల్యాండ్కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఇలీథ్ క్యాన్సర్ బారిన పడింది. ఇలీథ్ ఎక్కువ కాలం బతకదని వైద్యులు తేల్చి చెప్పారు. ఇలీథ్ బతికినంత కాలం సంతోషంగా ఉంచాలని ఆ బాలిక తల్లిదండ్రులు అనుకున్నారు. చాకెట్లు, బొమ్మలు ఇచ్చారు.కానీ వాటికి ఇలీథ్ షంతోషించలేదు...తనకు తన ఆరేళ్ల స్నేహితుడు హారిసన్ని పెళ్లి చేసుకోవాలని ఉందని ఇలీథ్ తల్లిదండ్రులుకి చెప్పింది. ఇలీథ్ని బాధపెట్టడం ఇష్టం లేక బంధువులు, స్నేహితుల సమక్షంలో హారిసన్తో ఇలీథ్ పెళ్లి ఘనంగా చేశారు. ఇలీథ్కు ఇంకా చాలా కోరికలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు.కన్నా కూతురు బతకదు అని తెలిసిన ఆమె చివరి కోర్కెలు తిరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఇలీథ్ తల్లిదండ్రులు చెపుతున్నారు.