//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

Category : world

చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు పెద్దయ్యాక తల్లి దండ్రలు మధ్య తిరుగుతున్నా వారు కనిపెట్టరు. కానీ వారిని తాకగానే తమ కొడుకని గుర్తుపడతారు. ఇవి సినిమాలలో తరుచుగా చూస్తుంటాం. కానీ ఇలాంటి సంఘటన బ్రెజిల్‌‌లోని ఫోర్టాలెజా ప్రాంత్రం లో జరిగింది. అమండా డిసిల్వా(28) అనే ఆమె నిండు గర్భిణి.అయితే ఆమె కోమాలో ఉన్న కారణంగా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సివచ్చింది. రెండు వారాలపాటు కోమాలో ఉన్న ఆమెకు తన నవజాత శిశువును తాకగానే స్పృహ వచ్చింది.

మూర్ఛవ్యాధితో బాధపడుతున్న అమండాకు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. నిండుగర్భిణి అయ్యున ఆమె కోమాలోకి వెళ్ళింది. దీంతో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. కానీ అప్పుడే పుట్టిన ఆ శిశువు బరువు రెండు కిలోలే ఉంది. దీంతో వైద్యులు ఆ శిశువుకు ప్రత్యేక వైద్యం అందించారు.

ఆ తరువాత ఆ ఆసుపత్రిలో పనిచేసే నర్సు ఫెబియోలా మాట్లాడుతూ ఆ శిశువుకు ప్రేత్యేక వైద్యం అందించాము. కోలుకున్న ఆ శిశువును తల్లి ఛాతీపై ఉంచిన కొద్దిసేపటికి ఆమెకు స్పృహ వచ్చిందని తెలిపింది. ఆ తరువాత ఆ శిశువు తల్లి అమండా మాట్లాడుతూ తనకు డెలివరీ ఎలా జరిగిందో తెలియలేదని, తన చిన్నారిని తాకగానే స్పృహలోకి రావటం విచిత్రంగా అనిపిస్తోందని సెప్పింది.