డిమాండ్ల సాధన కోసం 21 రోజులుగా విజయవాడ ధర్నాచౌక్లో రిలే నిరాహారదీక్షలు చేస్తున్న ఆయుష్ సిబ్బంది ఆదివారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గుండు గీయించుకుని సీఎం చంద్రబాబు చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చారు.
చంద్రబాబు తమకు వేంకటేశ్వరస్వామితో సమానమని, ఆయన తమ డిమాండ్లను పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. 15 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడంతో గత 21 రోజులుగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆయుష్ సిబ్బంది నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
21వ రోజు కడప జిల్లాకు చెందిన ఆయుష్ సిబ్బంది దీక్షలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సిబ్బంది నినాదాలు చేశారు. జూలై 20లోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంఘం నేతలు హెచ్చరించారు.