//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ నుండి బాబు అవుట్...!

Category : movies

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా 63 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది..వారం అంత ఎలాగున్నా శని, ఆది వారాలు మాత్రం ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తుంది. దీనికి ముఖ్య కారణం నాని. తనదయిన స్టయిల్ లో హోస్ట్ చేస్తూ , హౌస్ లో తప్పులు చేస్తున్న సబ్యులకు క్లాస్ లు తీసుకుంటూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ ఇస్తున్నాడు.

ఇక ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న బాబు గోగినేని, శ్యామల, తనీష్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు,గణేష్‌లలో ఇద్దరు సేఫ్ అయ్యారు. యాంకర్ శ్యామల, సింగర్ గీతా మాధురిలు ఈ వారం ఎలిమినేషన్‌ నుండి సేఫ్ అయినట్టు నాని తెలిపాడు.

ఇక మిగిలి ఉన్నముగ్గురిలలో బాబు గోగినేని ఈ వారం బ్యాగ్ సర్దేయాల్సిన టైం వచ్చినట్లు నమోదయిన ఓట్ల ద్వారా తెలుస్తుంది. మొదటి ప్లేస్ లో శ్యామల, గీత ఉండగా వారు సేఫ్ అయ్యారు. ఆ తర్వాత తనీష్ , దీప్తి , గణేష్ లు ఉన్నారు.

చివరిగా బాబు గోగినేని ఉండడం తో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లే సభ్యుడు బాబునే అని తెలుస్తుంది. మరి బాబు ను మాత్రమే బయటకు పంపిస్తారా..లేక మరో హౌస్ సభ్యుడిని కూడా బయటకు పంపిస్తారా అనేది ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Related News