//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబ్రీ మసీదును పునర్నించాలంటూ ఉత్తరప్రదేశ్ లో అందోళన

Category : world

బాబ్రీ మసీదును పునర్నించాలంటూ ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ‘25 ఏళ్ల విషాద సంఘటనను మరిచిపోవద్దు’ అనే అర్థం ఉన్న రాతలు ఆ పోస్టర్లలో ఉండటం కలకలం రేపుతోంది. ఈరాతలు ఎవరు రాసారు అనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు.

దీంతో అల్లర్లు చెలరేగే అకాశం ఉందని పోలీసులు భావిస్తుండటంతో, యూపీలోని పలు పట్టణాల్లో ముఖ్యంగా ఆలయాల వద్ద భద్రత పెంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.

కాగా, ఈ పోస్టర్లను పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యూపీలో బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగి ఇరవై ఐదేళ్లు అవుతుంది.మళ్ళి ఇన్నిసంవత్సరముల తరువాత జరిగిన ఈ రాతల విషయం ఎన్ని ఆవాంతరాలకు దారీ తిస్తుందోనని యూపీలోని పలు పట్టణాల్లోని ప్రజలు అందోళన చెందుతున్నారు.