//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వస్త్ర పరిశ్రమలో అడుగుపెడుతున్న బాబా రామ్ దేవ్

Category : business

ఫుడ్‌, మెడిసిన్స్‌, కాస్మోటిక్స్‌ల వ్యాపారాలలో  సంచలనాలు సృష్టిస్తూ కార్పొరేట్ సంస్థలకు సహితం దడ పుట్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్‌ ఇక వస్త్ర పరిశ్రమలోకి  అడుగు పెడుతున్నారు. త్వరలోనే బాబా రాందేవ్‌ బ్రాండెడ్‌ వస్త్రాలు మార్కెట్ లోకి రానున్నాయి. ''స్వదేశీ'' లైనప్‌లో పురుషులు, మహిళలు, పిల్లల కోసం రాందేవ్‌ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ బట్టల వ్యాపారాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించనుందని ఆ కంపెనీ అధికారిక ప్రతినిధి ఎస్‌కే టిజారావాలా చెప్పారు. 

ప్రారంభమైన తొలి ఏడాదే ఈ వస్త్రాల విక్రయ లక్ష్యం  రూ.5000 కోట్లుగా పెట్టుకున్నారు. ఈ లక్ష్య సాధనకు వస్త్రాల తయారిని కూడా చేపడుతున్నారు.   ఊలు, కాటన్, నైట్ వేర్, మెషీన్ మేడ్, డెనిమ్ వంటి వస్త్రాలను  మార్కెట్‌లోకి తీసుకొస్తామని టీజారావాల చెప్పారు. స్వదేశీ ఏజెండాలో తీసుకొస్తున్న ఈ  వ్యాపారానికి 'పరిదాన్‌' అనే పేరును పెట్టాలని కూడా చూస్తున్నారట. 

2018 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 250 ఎక్స్‌క్లూజివ్‌ రిటైల్‌ అవుట్‌లెట్లలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. అంతేకాక పతంజలి స్టోర్లు కూడా బిగ్‌ బజార్‌ లాంటి ఇతర అప్పీరెల్‌ రిటైల్‌ అవుట్‌లెట్లకు వీటిని అమ్మేలా నెట్‌వర్క్‌ను విస్తరింపనున్నారు.  దీనికోసం ఇప్పటికే బిగ్‌ బజార్‌తో పతంజలి చేతులు కలిపింది. 

గత నెలలోనే పరాక్రమ్‌ సురక్ష ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుతో ప్రైవేట్‌ సెక్యురిటీ బిజినెస్‌లోకి కూడా బాబా రాందేవ్‌ అడుగుపెట్టారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలు మార్చి 31 వరకు రూ.10,561 కోట్లగా ఉన్నాయి. 2018 మార్చి వరకు వీటిని రూ.20వేల నుంచి రూ.25వేల కోట్లకు పెంచుకోవాలని చూస్తున్నారు.