//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

24 గంటల్లో 5 కోట్లు

Category : movies business

హైదరాబాద్‌: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ‘మిర్చి’ తర్వాత దాదాపు ఐదేళ్లు ‘బాహుబలి’‘బాహుబలి 2’ సినిమా పనుల్లోనే ఉండిపోయారు. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం పలు కసరత్తులు చేసి బరువు పెరిగారు. కాగా జనవరిలో ‘బాహుబలి 2’ షూటింగ్‌ పూర్తి చేసుకుని మాహిష్మతి సామ్రాజ్యం నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన సుజీత్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇనాళ్లు మెలితిప్పిన మీసంతో కనిపించిన ప్రభాస్‌ గురువారం నిర్వహించిన ‘బాహుబలి 2’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో కొత్త లుక్‌లో మెరిసిపోయారు. దీంతో ప్రభాస్‌ తన కొత్త చిత్రంలో ఈ గెటప్‌లో కనిపిస్తారేమో..? అనే వూహాగానాలు వినిపిస్తున్నాయి. మరి విషయం తెలియాలంటే.. ప్రచార చిత్రాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.