Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అయోధ్య కేసు నేటినుంచి రోజువారీ విచారణ..?

Category : politics editorial

ఇక నేటి నుండి రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదం కేసు వేగవంతం కానుంది. అయితే సుప్రీం కోర్టు ఇక నుండి రోజు వారీగా విచారణ చేపట్టనుంది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా ప్రయత్నాలు జరిగాయని, కానీ కమిటీ ద్వారా ఎలాంటి ఫలితం రాలేదని తెలిపింది. ఆగస్టు1న కమిటీ నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి సీల్డ్ కవర్ లో సమర్పించిన అనంతరం.. ఈ నిర్ణయం తీసుకున్నారు సీజేఐ. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య అంశంపై ఇక రోజువారీగా విచారణ చేపట్టనుంది.రెండు వర్గాల మధ్య అయోధ్య భూవివాదంలో చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడం కోసం మార్చి 8న సుప్రీం మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది.

అయితే సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎఫ్‌ఎంఐ కలిఫుల్లా నేతృత్వంలోని ఈ కమిటీలో.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులుగా ఉన్నారు. ఇక ఆగస్టు 1న నివేదికను సమర్పించాల్సిందిగా, జులై 18న సుప్రీం మధ్యవర్తిత్వ కమిటీని ఆదేశించింది. దీంతో సీల్డ్ కవర్ లో నివేదికను సమర్పించారు సభ్యులు. కోర్టు మరుసటి రోజు నివేదిక పరిశీలించి.. దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ ఇరు వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపినా.. ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించడంలో విఫలమైందని వెల్లడించింది.