//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

Category : business

ప్రైవేట్‌ బ్యాంక్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది.

మార్జిన్ల బెడదతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకు రుణాలపై వడ్డీరేటును పెంచేందుకు నిర్ణయించింది. రుణాలపై వసూలు చేసే లెండింగ్‌ రేటుపై 5 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి 18నుంచి అమల్లోకి రానుందని వెల్లడించింది. దీంతో బ్యాంకు అందిస్తున్న వార్షిక ఎంసీఎల్ఆర్ 8.30 శాతానికి చేరింది.

వార్షిక రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచామనీ, జనవరి 18 నుంచి అమల్లోకి వస్తోందని స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో బ్యాంకు బ్యాంకు తెలిపింది. అయితే లాకింగ్‌ పీరియడ్‌లో పాత రుణగ్రహీతలకు పాత వడ్డీరేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం ప్రభావం కొత్తగా రుణాలను తీసుకునేవారిపై పడనుంది.

మరోవైపు వడ్డీరేటును పెంచుతున్న మొట్టమొదటి వాణిజ్య బ్యాంకుగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. దీంతో మూడు సంవత్సరాలలో మొదటిసారి వడ్డీ రేటు పెంచడం కొన్ని కీలక సంకేతాలను అందిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు.