Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ హద్దు మీరితే సహించేది లేదని హెచ్చరించిన దేవినేని అవినాష్....!

Category : politics

మొన్న జరిగిన ఏపి ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి రావడం జరిగింది.ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఆశించిన సీట్లు కూడా గెలుచుకోలేక కేవలం 23 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం మై గతంలో ఎప్పుడు చూడని ఘోర ఓటమి చవి చుడల్సి వచ్చింది.అలాగే ఈ ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని ఆశించిన గుడివాడ స్థానం లోనూ ఆ పార్టీ ఓటమి చవి చుడాల్సి వచ్చింది. ఇందుకోసం అక్కడ బలమైన కొడాలి నాని నీ డీ కొట్టడానికి దేవినేని అవినాష్ నీ ఇక్కడి నుంచి బరి లో దించింది టీడీపీ. అయిన ఫలితం లేకుండా పోయింది. అయినప్పటిినీ ఈ స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన దేవినేని అవినాష్ తాజగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం యెక్క పని తీరు పై తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ....గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తున్నామని.

ఇదే సమయంలో అధికారం ఉందని వైసీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ హెచ్చరించారు. తాజగా విజయవాడలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అవినాశ్.ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తామేమీ కుంగిపోలేదని, త్వరలో జరిగే పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చుకోవాలని సూచించారు. ప్రస్తుత పార్టీ కార్యాలయం తాత్కాలికమేనని, సమీప భవిష్యత్తులో ఏలూరు రోడ్ లో పూర్తిస్థాయిలో ఆఫీస్ ఏర్పాటు అవుతుందని దేవినేని అవినాష్ అన్నారు.