Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అవేంజర్స్ దెబ్బకు అవతార్ రికార్డ్ బ్రేక్.....?

Category : movies

బాక్స్ ఆఫీస్ రికార్డుల విషయంలో ఇండియాకు 'బాహుబలి' ఎలానో ప్రపంచం మొత్తానికి ''అవతార్'' సినిమా అలాగ. ఈ సినిమా రిలీజ్ అయ్యి కూడా దాదాపు 10 యేళ్లు కావొస్తోన్న... ఇప్పటవరకూ ఈ సినిమా కలెక్షన్లు ఇంకా ఏ హాలీవుడ్ సినిమా అందుకోలేక పోయింది.దాదాపు $2.78 బిలియన్ గ్రాస్ తో ప్రపంచంలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా 'అవతార్' ఇప్పటికీ కొనసాగుతోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వలో తెరకెక్కిన 'అవతార్' 2009 లో విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ ఏ ఒక్కటీ కూడా 'అవతార్' కలెక్షన్లకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. అయితే దాదాపు పదేళ్ళ తర్వాత ఆ రికార్డుకు 'అవెంజర్స్: ఎండ్ గేమ్' ఎసరుపెట్టేలా ఉంది.ఏప్రిల్ 26 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా $2.73 బిలియన్ గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

ఇప్పటికే హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లో రెండవ స్థానంలో ఉన్న 'టైటానిక్' ను మూడవ స్థానానికి నెట్టేసిన ఈ చిత్రం ప్రస్తుతం 'అవతార్' రికార్డుకు ఎసరు పెట్టే దిశగా కొనసాగుతోంది. ఈ సినిమా రిలీజై దాదాపు ఒకటిన్నర నెల దాటినా ఇంకా కలెక్షన్స్ ఫిగర్ పెరుగుతూనే ఉంది. ఇదే ఊపు కొనసాగితే అతి త్వరలో 'అవతార్' హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డు బ్రేక్ అవ్వడం ఖాయం అని చెప్పవచ్చు.మార్వెల్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ $356 మిలియన్లు. ఇప్పటికే సినిమా బడ్జెట్ కు ఏడు రెట్లు కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ ఫిగర్ వచ్చేసరికి ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ చిత్రం ఇండియాలోనే మూడు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించడం గమనార్హం.ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్, మార్క్ రఫాలో, క్రిస్ హెమ్స్ వర్త్, స్కార్లెట్ జాన్సన్, జెరెమీ రెన్నర్, పాల్ రడ్, బ్లీ లార్సన్, బ్రాడ్లీ కూపర్, జోష్ బ్రోలిన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రూసో బ్రదర్స్దర్శకత్వం వహించారు.

Related News