//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆస్ట్రేలియా జట్టు కోచ్ డారెన్ లెహ్మన్ సంచలన ప్రకటన....!

Category : sports

బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు కోచ్ డారెన్ లెహ్మన్ సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియా క్రికెట్ టీం కోచ్ పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు . సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఆసీస్ ఆటగాళ్లు ప్లాన్ ప్రకారం బాల్ ట్యాంపరింగ్‌ చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.

ఈ విషయం లో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, వార్నర్‌లని ఏడాదిపాటు, బాన్‌క్రాఫ్ట్‌ని 9 నెలలు నిషేధించింది. అంతేకాక స్మిత్, వార్నర్‌లను ఐపీఎల్‌ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు రాజీవ్ శుక్లా ప్రకటించారు. ఈ విషయం లో తన తప్పుని అంగీకరిస్తూ తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కన్నీరు పెట్టాడు .

ఇది చూసిన లెహ్మన్ ఈ జట్టుకి కొత్త కోచ్ అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆటగాళ్లకి గుడ్‌బై చెప్పడం నా జీవితంలోనే కష్టమైన పని, కానీ అది చేయక తప్పడం లేదు అని అన్నారు . తన జీవితంలో ఫిలిప్ హ్యూస్ మరణం ఎప్పటికీ మర్చిపోలేదని, తాను చివరిగా అన్న మనం క్రికెట్ ఆడుతున్నాం అన్న మాటలు ఎప్పటికీ తన మదిలో ఉంటాయని తెలిపారు. 2013లో లెహ్మన్ క్రికెట్ ఆస్ట్రేలియాకి హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు.