Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్లెడ్జింగ్ దెబ్బకి విల విల లాడుతున్న ఆస్ట్రేలియా

Posted a year ago | Category : sports

స్లెడ్జింగ్..ఈ పదం విన్న వెంటనే మనకు ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే స్లెడ్జింగ్ ను పెంచి పోషించింది వారే కనుక. వెస్టిండీస్ తర్వాత ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని చూపిన మరో జట్టు ఆస్ట్రేలియా. వీరు ఆడడం సగమైతే ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడం, తొండాట ఆడి గెలవడం వలెనే చాలా విజయాలు సాధించారు అన్నది ప్రపంచ క్రికెట్ ఎరిగిన వాస్తవం. ఎంతటి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లనైనా మైదానంలో తమ మాటలు, చేష్టలతో విసిగించి అవుటయ్యేలా చేయడం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.అయితే ఇలాంటి విపరీత ధోరణులను అనుసరించే ఆసీస్ టీమ్ కు భారత జట్టుతో చాలా విభేదాలు ఉన్నాయి. ఎంతో క్రీడా స్ఫూర్తితో మెలిగే బారత టీమ్ ను వారు ఏనాడు వదలలేదు. హర్భజన్ సింగ్, సైమండ్స్ మధ్య చెలరేగిన 'మంకీ గేట్' వివాదం, మొదలుకొని సచిన్ పై పాంటింగ్ విమర్శలు వంటి వివాదాలు ఇరుజట్ల మధ్య కోకొల్లలు. అయితే, ఎప్పుడూ సహనంగా ఉండి మాట అన్నా పట్టించుకోకుండా తమ ఆట తాము ఆడుకొనే భారత జట్టుకు సౌరభ్ గంగూలీ దూకుడును నేర్పాడు. ఆస్ట్రేలియాకు ఆటతోనే కాదు, మాటతోను బదులివ్వడం నేర్చుకున్నారు భారత ఆటగాళ్లు. 

ఈ పరంపర ధోనీ హయాంలోనూ కొనసాగింది. తాజాగా విరాట్ కోహ్లీ అయితే ఏకంగా ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు.ఇన్నాళ్లు ప్రత్యర్థి జట్లను స్లెడ్జింగ్ తో ఇబ్బంది పెట్టిన ఆస్ట్రేలియా.. అది తమకు ఎదురయ్యే సరికి ఏమి తెలియనట్లుగా బుద్ధిమంతులం అన్నట్లు నడుచుకుంటుంది. భారత జట్టు ప్రవర్తనను అది జీర్ణించుకోలేక పోయింది. తాజాగా జరిగిన 2 వ టెస్టులో స్మిత్ అవుటయ్యాక డ్రస్సింగ్ రూమ్ వైపు చూడడం ఇరుజట్ల మధ్య మరో వివాదాన్ని లేపింది. స్మిత్ నిజంగానే క్రేడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడు. కానీ ఆస్ట్రేలియా జట్టులోని ఒక్క ఆటగాడు కూడా అతడు చేసింది తప్పు అని అనలేదు. పైగా అతన్ని సమర్ధించారు. 

ఆస్ట్రేలియా ప్రత్యేక 'The Daily Telegraph' అయితే భారత జట్టుపైన కోహ్లీ, కుంబ్లే లపై దుమ్మెత్తి పోసింది.అంటే తమ ఆటగాళ్ల తప్పును గుర్తించకపోవడం, గుర్తించిన దాని గురించి మాట్లాడకపోవడం ఆస్ట్రేలియా జట్టుకు, మాజీలకు. ఆ దేశ మీడియాకు అలవాటుగా మారింది. ఆస్ట్రేలియా జట్టు మారినట్లుగా నటించడం కాదు, మారితే ప్రపంచ క్రికెట్ కు మేలు జరుగుతుంది. లేదంటే తాము పెంచి పోషించుకున్న స్లెడ్జింగ్ అనే వ్యాధికి చివరికి అదే బలికావాల్సి వస్తుంది అన్నది సత్యం.


మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 9 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 3 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 13 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 14 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!